News October 21, 2025
అనంతపురంలో ‘కె ర్యాంప్’ హీరో

‘కె ర్యాంప్’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం సోమవారం రాత్రి అనంతపురంలో సందడి చేశారు. నగరంలోని గౌరీ థియేటర్లో ఆయన ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. థియేటర్‌కు హీరో వచ్చాడన్న విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు వేశారు. ఈ దీపావళికి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Similar News
News October 21, 2025
నస్రుల్లాబాద్: వృద్ధురాలి హత్య.. నగలు దోపిడీ (UPDATE)

నస్రుల్లాబాద్(M) అంకోల్ తండాలో <<18063585>>వృద్ధురాలి హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. రాధీ బాయి ఒంటరిగా నివసిస్తుంది. సోమవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సవాయిసింగ్ ఇంట్లోకి వెళ్లి రాధీ బాయిని గొడ్డలితో నరికి ఆమెపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీన్ని చూసిన లక్ష్మీ అనే మహిళ ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సవాయిసింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
News October 21, 2025
జగిత్యాల: ‘సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం’

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలలో మంగళవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి జ్ఞాపికలను అందజేశారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని SP, కలెక్టర్ హామీ ఇచ్చారు. పలువురు పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు .
News October 21, 2025
తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు

TG: రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.