News December 21, 2025

అనంతపురంలో గన్ కలకలం

image

అనంతపురంలో జిమ్ ఓనర్ రాజశేఖర్ రెడ్డి వద్ద గన్ లభించండం కలకలం రేపింది. ఈనెల 11న తనను హింసిస్తూ గన్‌తో బెదిరించినట్లు ఆయన భార్య మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గన్ స్వాధీనం చేసుకొని విచారించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గన్ కొన్నట్లు తేలడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి ఆయుధాల తయారీదారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని అనంతపురం తీసుకొస్తున్నట్లు సమాచారం.

Similar News

News December 22, 2025

తిరుపతి జిల్లాలో తొలిసారి..!

image

TDP తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి నియమితులైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అధ్యక్షురాలిగా ఎంపిక కాలేదు. తొలిసారి పనబాకకు ఆ అవకాశం దక్కింది. పార్లమెంట్ పరిధిలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు SC రిజ్వర్ నియోజకవర్గాలు. కేంద్ర మంత్రిగానూ పనిచేయడంతో SC సామాజిక వర్గానికి చెందిన ఆమెకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.

News December 22, 2025

కొలువు తీరనున్న పంచాయతీ పాలకవర్గం

image

దాదాపు రెండున్నర ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈరోజు గ్రామపంచాయతీ పాలకవర్గం కొలువు తీరనుంది. భద్రాద్రి జిల్లాలో 469 గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ – 271, బీఆర్ఎస్ – 105, సీపీఐ – 47, ఇతరులు – 46, (పెండింగ్ GPలు జూలూరుపాడు చాపరాలపల్లి మినహా) మిగిలిన 469 పంచాయతీలో పాలకవర్గం ఏర్పాటు అవుతుంది. పాలకవర్గం ఏర్పాటుతో సమస్యలు పరిష్కారం కావాలని ప్రజలు ఆశిస్తున్నారు

News December 22, 2025

HALలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<>HAL<<>>) నాసిక్ 11పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 28ఏళ్ల లోపు అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్, నర్సింగ్(డిప్లొమా) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జనవరి 11న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in