News February 18, 2025
అనంతపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 21, 2025
వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించండి: కలెక్టర్

వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి చిత్తడి నేలల పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఫేస్-1, 2, 3లో జిల్లాలో గుర్తించదగిన చిత్తడి నేలల కోసం నోటిఫికేషన్ ప్రతిపాదనల తయారీ, సమర్పణ చేయాలన్నారు.
News February 20, 2025
గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత

అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
News February 20, 2025
ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు అస్వస్థత

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న నలుగురు విద్యార్థినులను వెంటనే అనంతపురం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.