News August 24, 2024
అనంతపురంలో టన్ను చీనీ రూ.23వేలు, కిలో టమాటా రూ.20

అనంతపురం జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.23వేలు, కనిష్ఠంగా రూ.8వేలు, సరాసరి రూ.15,500లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం మొత్తంగా 263 టన్నుల చీనీకాయలు వచ్చాయని వెల్లడించారు. ఇక కిలో టమాటా గరిష్ఠంగా రూ.20 పలికింది. మధ్యస్థం రూ.11, కనిష్ఠం రూ.6 చొప్పున పలికాయి.
Similar News
News February 22, 2026
1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి “మీ కోసం” కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పెండింగ్ అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.inలో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈనెల 23న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తారు.
News February 22, 2026
కంబదూరు మండలంలో విషాదం

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 19, 2026
మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.


