News January 6, 2025

అనంతపురంలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు APSLPRB అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8, 9 & 10 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను.. 17, 18 & 20 వ తేదీలకు మార్పు చేస్తూ వాయిదా వేశారు. వైకుంఠ ఏకాదశి పండుగ , ఇతర శాంతి భద్రతల కారణాలతో 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

Similar News

News January 8, 2025

రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి: జేసీ

image

రెవెన్యూ సదస్సులలో సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకుని, అభివృద్ధి బాటలో నడవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మండలం ధర్మాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. రైతులందరూ పరస్పర సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

News January 7, 2025

ఎస్సీ కులగణ‌నపై 12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ: కలెక్టర్

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల (ఆడిట్ ప్ర‌క్రియ) స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రో 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు అందించిందన్నారు. ఎస్‌వోపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు.

News January 7, 2025

కదిరి మార్కెట్ యార్డులో దొంగ నోట్ల కలకలం

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డులో మంగళవారం దొంగ నోట్లు కలకలం రేపాయి. గొర్రెల సంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగేశ్ అనే రైతు వద్ద గొర్రెలు కొనుగోలు చేశాడు. అందుకు రూ.32,000 దొంగ నోట్లు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని మరో వ్యక్తి ద్వారా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.