News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
News March 22, 2025
HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.
News March 22, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

పలుచోట్ల ఇఫ్తార్ విందు
టెన్త్ పరీక్షలు.. తనిఖీ చేసిన కలెక్టర్లు
CMను కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో గద్వాల ఇన్‌స్టా రీల్
నాగర్‌కర్నూల్:Way2Newsతో చెంచులు
అయిజ: వేరుశనగతో వెళ్తున్న ఆటో బోల్తా
NGKL: ‘ఈనెల 26న వేసెక్టమి ఆపరేషన్లు’
ఘనంగా ‘ప్రపంచ కవితా దినోత్సవం’
NRPT: భార్యను చంపిన భర్త అరెస్ట్
పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్