News December 8, 2025

అనంతపురంలో వాహనదారులపై పడ్డ TDP ఫ్లెక్సీలు

image

అనంతపురంలో TDP ఫ్లెక్సీలు కిందపడి ఇద్దరికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. అనంతపురం తపోవనం బ్రిడ్జిపై నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారని పలువురు ఆరోపించారు. కాగా నేడు ఫ్లెక్సీలు ఉన్న మార్గంలో పలువురు వెళ్తుండగా ఫ్లెక్సీలు పైన పడడంతో బైక్‌పై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా జనాలపై ఎందుకు మీకు ఇంత కక్ష అంటూ YCP తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలు పోస్ట్ చేసింది.

Similar News

News December 8, 2025

వేగంగా భూ సేకరణ చేయాలి: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు వేగంగా భూ సేకరణ చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు సోమవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో భూ సేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజాంపట్నం మండలంలో రాడార్ కేంద్రానికి 1.5 ఎకరాలు భూమి కేటాయించాలని, మార్టూరులో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 100 ఎకరాలు, జిల్లా కేంద్రంలో హెలిపాడ్ ఏర్పాటుకు పది ఎకరాలు భూమి కేటాయించాలన్నారు.

News December 8, 2025

పెద్దపల్లి: పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందించాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9, 12న రెండో, మూడో విడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. పోలింగ్ సామగ్రి సరఫరా, కేంద్రాల పరిశీలన, కౌంటింగ్, ఉపసర్పంచ్ ప్రక్రియలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News December 8, 2025

పార్వతీపురం: ఎస్పీ పీజీఆర్ఎస్‌కు 9 వినతలు

image

ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 9 వినతులు వచ్చినట్లు ఎస్సీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను తక్షణమే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించి వాటిని నివేదికను ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.