News May 19, 2024
అనంతపురంలో హీరో శ్రీకాంత్ నేటి పర్యటన వాయిదా

హీరో శ్రీకాంత్ ఆదివారం అనంతపురం నగర పర్యటన వాయిదా పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లభించలేదు. ఈ కారణంగా శ్రీకాంత్ పర్యటన వాయిదా పడినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
Similar News
News February 22, 2026
1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి “మీ కోసం” కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పెండింగ్ అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.inలో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈనెల 23న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తారు.
News February 22, 2026
కంబదూరు మండలంలో విషాదం

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News February 19, 2026
మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.


