News January 6, 2025
అనంతపురంలో KG టమాటా రూ.6
అనంతపురంలో టమాటా ధరలు బాగా పడిపోయాయి. నిన్న కక్కలపల్లి మార్కెట్లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.10 పలికిందని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ వెల్లడించారు. మరోవైపు కనిష్ఠ ధర రూ.6గా నమోదైందన్నారు. మొత్తంగా నిన్న ఒక్కరోజు మార్కెట్‌కు 1050 టన్నులు రాగా సరాసరిగా కిలో టమాటా రూ.8 పలికింది.
Similar News
News January 7, 2025
ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు అందించిందన్నారు. ఎస్‌వోపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు.
News January 7, 2025
కదిరి మార్కెట్ యార్డులో దొంగ నోట్ల కలకలం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డులో మంగళవారం దొంగ నోట్లు కలకలం రేపాయి. గొర్రెల సంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగేశ్ అనే రైతు వద్ద గొర్రెలు కొనుగోలు చేశాడు. అందుకు రూ.32,000 దొంగ నోట్లు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని మరో వ్యక్తి ద్వారా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News January 7, 2025
కోర్టు కేసుల పరిష్కారంలో జవాబుదారీతనం ఉండాలి: కలెక్టర్
కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులకు జవాబుదారీతనం ఉండాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కోర్టు కేసులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్ అధికారులను నియమించామన్నారు.