News November 16, 2024

అనంతపురం కలెక్టర్ సూచనలు 

image

ఆడపిల్లల రక్షణ, భద్రతకు అధికారులు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం “మిషన్ శక్తి” ఇంటిగ్రేటెడ్ మహిళాసాధికారత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. హింసకు గురవుతున్న మహిళలు, సహాయం కావలసిన వారికి పునరావాసం, భద్రత కల్పించడానికి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు.

Similar News

News November 15, 2024

ఆ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: DMHO

image

అనంతపురం: నవజాత శిశువుల్లో సోకే వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని DMHO దేవి సూచించారు. సర్వజన ఆసుపత్రిలో వైద్య, ఆరోగ్య అధికారులతో సమావేశమయ్యారు. నవజాత శిశువులు, గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నవజాత శిశువులు వ్యాధులు బారిన పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులతో చికిత్స చేయించాలన్నారు. అత్యధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వాడకం అరికట్టాలని సూచించారు.

News November 15, 2024

అనంతపురంలో ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభం

image

అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ సంతోశ్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్  ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చోటే, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.

News November 15, 2024

గుత్తి: డబుల్ రైల్వే లైన్‌కు భూముల పరిశీలన

image

గుత్తి-పెండేకల్లు రైల్వే డబుల్ లైన్ పనులు త్వరలో జరగనున్నాయి. వీటికి చెట్నేపల్లి సమీపంలోని భూములను కేటాయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ శుక్రవారం వీటిని పరిశీలించారు. మ్యాపులను వీక్షించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహశీల్దార్ ఓబులేసు, రైల్వే సెక్షన్ ఆఫీసర్ విమలేష్ కుమార్, సర్వేయర్ శేష సాయి తదితరులు పాల్గొన్నారు.