News January 8, 2026

అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు

image

అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత దృష్ట్యా లాయర్లు, సిబ్బందిని వెలుపలికి పంపారు. డీఎస్పీ శ్రీనివాసులు నాయకత్వంలో బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్ కోర్టు ప్రాంగణంలో సుదీర్ఘ తనిఖీలు చేపట్టాయి. ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News January 10, 2026

ఫిబ్రవరి 14న మున్సిపల్ ఎన్నికలు!

image

TG: రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 17న ప్రకటించొచ్చని తెలుస్తోంది. BCలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని పురపాలక శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.

News January 10, 2026

ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి మరిన్ని చిత్రాలు

image

ఈ ఏడాది ఆస్కార్‌ రేసులో తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ బెస్ట్ పిక్చర్‌ కేటగిరీలో పోటీ పడనుంది. ఇక హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన <<18806607>>కాంతార<<>>: చాప్టర్‌-1, మహావతార్‌ నరసింహ చిత్రాలు జనరల్‌ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఇవి ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో సెలక్ట్ అయ్యాయి. అలాగే తన్వీ ది గ్రేట్‌, సిస్టర్‌ మిడ్‌నైట్‌, హోమ్‌బౌండ్ సినిమాలు ఉన్నాయి.

News January 10, 2026

మెదక్: ‘సీఎం కప్ క్రీడలు.. 16 వరకు ఛాన్స్’

image

మెదక్ జిల్లాలో ‘సీఎం కప్’ క్రీడల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేష్ మండల విద్యా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. క్రీడల అవగాహన కోసం ఈనెల 12 వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.