News November 24, 2024
అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి
గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు ఏడుగురు మరణించగా.. ప్రస్తుతం అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఈశ్వరయ్యకు మెరుగైన వైద్యసేవలు అందించినా.. దురదృష్టవశాత్తు అతను కూడా మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Similar News
News November 23, 2024
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం: వైయస్ జగన్
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మత్యువాత పడ్డారు. వీరంతా కూలీ పనులకు వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం మాజీ సీఎం జగన్ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News November 23, 2024
ATP: ఘోరం.. ఒకే ఊరిలో ఏడుగురి మృతి
అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం జరిగిన <<14686395>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> ఓ ఊరినే విషాదంలోకి నెట్టేసింది. ఈ ఘటనలో పుట్లూరు(M) ఎల్లుట్ల గ్రామానికి చెందిన ఏడుగురు చనిపోయారు. మృతులు డి.నాగమ్మ, బి.నాగమ్మ, బి.నాగన్న, రామాంజినమ్మ, బాల పెద్దయ్య, కొండమ్మ, జయరాముడిగా గుర్తించారు. కాగా ఇందులో నాగమ్మ, నాగన్న భార్యాభర్తలు. అరటికాయల కూలీ పనులకు ఆటోలో వెళ్తుండగా బస్సు ఢీకొని వీరంతా చనిపోయారు.
News November 23, 2024
గార్లదిన్నె: రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. కూలి పనుల కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.