News August 25, 2025
అనంతపురం జిల్లాకు CM రాక.. ఎప్పుడంటే

CM సెప్టెంబర్ మొదటి వారంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం పర్యటన కోసం అనంతపురం పరిధిలోని SK యూనివర్సిటీ వద్ద అనంతపురం- కదిరి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్, జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు.
Similar News
News February 22, 2026
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

జిల్లాలో సోమవారం నుంచి జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News February 22, 2026
1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి “మీ కోసం” కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. పెండింగ్ అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.inలో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈనెల 23న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తారు.
News February 22, 2026
కంబదూరు మండలంలో విషాదం

కంబదూరు మండలం మర్రిమాకుల పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండి బోల్తా పడటంతో గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు(57) మృతి చెందారు. ఈయన ఎద్దుల బండిని తోలుకుంటూ పొలానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


