News October 31, 2024

అనంతపురం జిల్లాలో ఇంటింటా డాం.. డాం

image

జిల్లాలో వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ప్రజలు లక్ష్మీపూజలు, నోములు, వ్రతాలు చేశారు. ఈ సారి 20 శాతం మేర టపాసుల ధరలు పెరిగినా ఎవరి సామర్థ్యం మేరకు వారు కొనుగోలు చేశారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ఎటుచూసినా పటాసుల శబ్దాలే వినిపిస్తున్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి వంటి ప్రధాన పట్టణాల్లో టపాసుల మోత మోగుతోంది. మరి మీ ఇంట దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కామెంట్ చేయండి..

Similar News

News October 31, 2024

అనంతలో పండగపూట విషాదం

image

అనంతపురంలోని పిల్లిగుంట కాలనీలో గురువారం శ్రీనివాసులు అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు శ్రీనివాసులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News October 31, 2024

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శ దాయకం: కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకందరికీ ఆదర్శ దాయకమని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.

News October 31, 2024

కొనుగోళ్లు అంతంతమాత్రమే..

image

అనంతపురం జిల్లాలో టపాసులను అత్యధికులు పరిమిత స్థాయిలోనే కొనుగోలు చేస్తున్నారు. తారాజువ్వలు, చిచ్చుబుడ్డి, కాకరపువ్వొత్తులు, తాళ్లు, పాము బిళ్లలు, భూచక్రాలు వంటి వాటికి డిమాండ్ ఉంది. భారీ శబ్దాలు వచ్చే వాటిపై ఆసక్తి కనబరచడం లేదు. ఈసారి ధరలు 20% పెరిగాయని అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, ఉరవకొండ, గుత్తి తదితర ప్రాంతాల్లోని వినియోగదారులు చెబుతున్నారు. మరి మీ ఇంట దీపావళి సందడి ఎలా ఉంది. కామెంట్ చేయండి..