News November 27, 2025

అనంతపురం జిల్లాలో దారుణం

image

అనంతపురం శారదానగర్‌లో గురువారం దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్య అమూల్య తన 3 ఏళ్ల కుమారుడు సహస్రను గొంతు కోసి, తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇరువురు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

సూర్యాపేట వాసికి నేషనల్ ఫార్మా అవార్డు

image

సూర్యాపేట వాసి డా.అనంతుల రవి శేఖర్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 వేడుకలో ఆయనకు నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు వరించింది. శాస్త్రవేత్తగా చేసిన ప్రయోగాత్మక సేవలకు సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని రవి శేఖర్ తెలిపారు.

News November 28, 2025

అమలాపురం: 22 మందికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 22 మండలాలకు డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా సచివాలయ పరిపాలన పర్యవేక్షణకు ఈ నియామకాలు చేపట్టారు. గ్రామ పంచాయతీల్లోని సీనియర్ గ్రేడ్-1 కార్యదర్శులకు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీవోలుగా అవకాశం కల్పించారు.

News November 28, 2025

HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

image

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.