News February 1, 2025

అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీలో సర్వర్ సమస్య

image

అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తోందని తెలిపారు. స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News February 1, 2025

అమానుష ఘటన.. మరో 8 మంది అరెస్ట్

image

ప్రేమజంట పారిపోవడానికి సాయం చేసిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు ఓ మహిళను వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెల 15న మునిమడుగులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఇప్పటి వరకు 20మంది నిందితులను అనంతపురం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News February 1, 2025

అనంత జిల్లాకు 14 మద్యం దుకాణాల కేటాయింపు

image

అనంతపురం జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాలను కేటాయించినట్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈడిగలకు 9, కాలాలి 1, గౌడు 2, గౌడ 1, గౌన్లకు 1 కేటాయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 17న రెవెన్యూ భవన్లో లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామన్నారు.

News February 1, 2025

కేంద్ర బడ్జెట్.. అనంతకు వరాలు కురిపించేనా?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, జిల్లా పరిధిలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రకటన, పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న బెల్ కంపెనీ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజలు ఎదరుచూస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీకి నిధులు పెరిగితే జిల్లా వాసులకు లబ్ధి చేకూరనుంది.