News October 22, 2024

అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం

image

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి పుట్టపర్తి, అనంతపురం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెట్లు, టవర్లు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని ప్రజలను అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది.

Similar News

News January 3, 2025

పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించండి: కలెక్టర్

image

దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాలను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, సెర్ప్ సీఈవో వీర పాండ్యన్ తెలిపారు. రాజధాని నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.

News January 2, 2025

శ్రీ సత్యసాయి కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్‌ను ఎస్పీ రత్న గురువారం కలిశారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలు గురించి చర్చించారు.

News January 2, 2025

ఫూటుగా పెగ్గులెత్తారు!

image

అనంతపురం జిల్లాలో మందు బాబులు కిక్కుతో 2024కు వీడ్కోలు పలికి.. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు ఫూటుగా తాగడంతో జిల్లాలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు జరిగాయి. 24 గంటల్లో ఏకంగా రూ.5.46 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది. అనంతపురం జిల్లాలో రూ.3.87 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.1.59 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.