News April 27, 2024
అనంతపురం జిల్లాలో భానుడి ఉగ్రరూపం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో భానుడు రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం అత్యధికంగా బొమ్మనహల్ మండలంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు రేకులకుంట పరిశోధన స్థానం శాస్త్రవేత్త సహదేవరెడ్డి తెలిపారు అదేవిధంగా యల్లనూరు, తాడిపత్రి, 43.3, గుంతకల్, తాడిపత్రి,43.1, శింగనమల, చెన్నేకొత్త పల్లి,43.0, పరిగి 42.9, పుట్టపర్తి 42.9, ముదిగుబ్బ 42.8, యాడికి 42.5 నమోదైనట్లు తెలిపారు.
Similar News
News September 11, 2025
అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఈయనే!

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. కేరళ రాష్ట్రం మలప్పురంలో జన్మించిన ఆయన కేరళ యూనివర్సిటీలో బీటెక్ పట్టభద్రుడయ్యారు. 2016 IAS బ్యాచ్‌కు చెందిన ఆనంద్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే IAS అయ్యారు. UPSC పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుత కలెక్టర్ డా.వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
News September 11, 2025
అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.
News September 10, 2025
రైతులు అధైర్య పడకండి.. యూరియా కొరత లేదు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్‌సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.