News September 27, 2024
అనంతపురం జిల్లాలో మరో దారుణం.. చిన్నారిపై అఘాయిత్యం
అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో 10 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తిరుపాలుకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 10, 2025
అనంతపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం
అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 12 మంది బంగారు వ్యాపారులు కేరళ నుంచి రైలులో వస్తుండగా.. సుంకం చెల్లించని దాదాపు 13 కేజీల బంగారాన్ని గుర్తించారు. పంచనామా నిమిత్తం తాడిపత్రికి వచ్చి కస్టమ్స్ కార్యాలయం నుంచి విజయవాడకు తరలించారు.
News January 10, 2025
సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ
బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.
News January 9, 2025
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎన్హెచ్‌ఏఐ, రైల్వే, రోడ్లు భవనాలు, అటవీ శాఖ, చిన్న నీటిపారుదల, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగే భూసేకరణకు సంబంధించి జరిగే సమావేశాలలో ఎన్‌హెచ్ పీడీ హాజరుకావాలని హెచ్చరించారు.