News December 25, 2024

అనంతపురం జిల్లాలో 24 గంటల్లో 644 కేసులు నమోదు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పోలీసులు దాడులు నిర్వహించారని ఎస్పీ జగదీశ్ తెలిపారు. ఈ దాడుల్లో 644 కేసులు నమోదు చేసి రూ.1,67,230ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎంవీ కేసులు నమోదు చేయడంతో పాటు మట్కా, తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు.

Similar News

News December 25, 2024

గుత్తి: లారీ ఢీకొని ఒకరు మృతి

image

గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి అతివేగంగా రోడ్డు పక్కన ఉన్న వాటర్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ఎంగన్నపల్లికి చెందిన భాస్కర్(24) మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ సురేష్ స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.  

News December 25, 2024

ATP: విద్యుత్ షాక్‌తో కుమారుడి మృతి.. ఆటో బోల్తాపడి తండ్రికి గాయాలు

image

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం జె.వెంకటాంపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అభిలాష్ (19) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శివయ్య ఆటోలో రాయదుర్గం ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 25, 2024

తిప్పేపల్లిలో విదేశీ అతిథులు!

image

ధర్మవరం నియోజకవర్గంలో సైబీరియా పక్షుల సందడి మొదలైంది. కొన్నిరోజులుగా తిప్పేపల్లి గ్రామంలో తెలుపు, నలుపు, ఎరుపు వర్ణాలతో అందంగా ఉన్న సైబీరియన్‌ పక్షులు సందడి చేస్తున్నాయి. వరి పొలాల వద్ద కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సైబీరియా, యూరప్ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి తిప్పేపల్లికి రావడం శుభ సూచకమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఈ పక్షులు ఏటా తమ గ్రామానికి వచ్చే విదేశీ అతిథులని చెబుతున్నారు.