News April 1, 2025
అనంతపురం జిల్లాలో 7 కరవు మండలాలు.!

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో అనంతపురం జిల్లాలో మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాకిడి, విడపనకల్లు మండలాలకు స్థానం లభించింది. మిగతా మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.
Similar News
News April 3, 2025
ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ పి.జగదీశ్

సామాజిక మాధ్యమాల్లో కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
News April 3, 2025
అనంతపురం జిల్లాలో 89 మంది కానిస్టేబుళ్ల బదిలీ

అనంతపురం జిల్లాలో బుధవారం కానిస్టేబుళ్ల బదిలీలు పారదర్శకంగా జరిగాయి. ఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి 89 మందిని బదిలీ చేశారు. సీనియార్టీ ఆధారంగా సిబ్బంది కోరుకున్న చోటుకే స్థాన చలనం కల్పించారు. పట్టణాల్లో పని చేస్తున్న వారిని రూరల్ పోలీసు స్టేషన్లకు, రూరల్ ఏరియాలలో పని చేస్తున్న వారిని పట్టణ ప్రాంతాల స్టేషన్లకు బదిలీ చేశారు. 89 మందికి అక్కడికక్కడే బదిలీ ఉత్తర్వు ప్రతిని అందజేశారు.
News April 3, 2025
8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తారని వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని పేర్కొన్నారు. జగన్ పర్యటనకు జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆయన మండిపడ్డారు.