News September 27, 2025
అనంతపురం జిల్లాలో 82.6 మి.మీ వర్షపాతం నమోదు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 82.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ తెలిపారు. విడపనకల్ 11.4, గుత్తి 10.8, ఉరవకొండ 6.8, ఆత్మకూరు 5.4, కనేకల్ 5.2, పెద్దవడుగూరు 5.2, వజ్రకరూరు 5.0, గుంతకల్ 4.2, గార్లదిన్నె 4.2, నార్పల 3.6, BKS 3.2, బొమ్మనహళ్ 2.4, పామిడి 2.4, బెలుగుప్పలో 1.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని చెప్పారు.
Similar News
News September 27, 2025
రానున్న 4 రోజులపాటు వర్షాలు

రానున్న రెండు రోజులపాటు అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు, సీనియర్ శాస్త్రవేత్త నారాయణ స్వామి తెలిపారు. నేడు 10.5 మి.మీ సగటుతో మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయన్నారు. 28న 3 మి.మీ సగటు వర్షపాతం నమోదు కానుందన్నారు. 29, 30, 31వ తేదీలలో తుంపర్లు పడే సూచన ఉందని పేర్కొన్నారు.
News September 27, 2025
పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా సంబంధిత శాఖ అధికారులు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఆహ్వానించాలన్నారు.
News September 26, 2025
తల్లి మందలించిందని కొడుకు సూసైడ్

అతిగా మద్యం తాగుతున్నాడని తల్లి కొడుకును మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. చిట్టూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్(24) పదేపదే మద్యం తాగుతున్నాడని తల్లి పెద్దక్క మందలించింది. రాత్రి ఇంటి నుంచి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అనంతపురానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.