News December 24, 2025

అనంతపురం జిల్లాలో 92 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయం 92 <>అంగన్‌వాడీ<<>> కార్యకర్తలు, హెల్పర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసై, 21-35ఏళ్లు ఉన్న స్థానిక మహిళలు నేటి నుంచి డిసెంబర్ 31వరకు అప్లై చేసుకోవచ్చు. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

Similar News

News December 30, 2025

జర్మన్ పౌరుడికి ఎలా పెన్షన్ ఇస్తాం: ఆది శ్రీనివాస్

image

TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ పెన్షన్ పొందడంపై MLA ఆది శ్రీనివాస్ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. రమేష్ జర్మన్ పౌరుడు అని కేంద్ర హోంశాఖ ధ్రువీకరించగా, తప్పుడు పత్రాలతో గెలిచినందుకు హైకోర్టు ఆయనకు రూ.30 లక్షల ఫైన్ విధించిందని ఫిర్యాదులో తెలిపారు. అయినా మాజీ ఎమ్మెల్యేగా ప్రతి నెలా రూ.50వేలు పెన్షన్ అకౌంట్లో జమ అవుతోందన్నారు. అయితే ఈ అంశంపై సెక్రటరీకి నిర్ణయాధికారం లేదు.

News December 30, 2025

వంటింటి చిట్కాలు

image

* బాగా పండిన టమాటాలు పాడవకుండా ఉండాలంటే చల్లని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి రాత్రంతా ఉంచితే మర్నాటికి తాజాగా తయారవుతాయి.
* కూరల్లో ఉల్లిపాయకు బదులు క్యాబేజీ తురుమును వాడితే అంతే రుచిగా ఉంటుంది.
* చీమలు తిరిగే చోట వెనిగర్ కలిపిన నీళ్ళను చల్లి తుడవండి.
* రిఫ్రిజిరేటర్ దుర్వాసన వేస్తుంటే బ్రెడ్ స్లైస్ అందులో పెట్టండి.
* చాకుని ఉప్పు నీటిలో ఉంచితే పదునెక్కుతుంది.

News December 30, 2025

చెత్త రికార్డు.. 10 ఓవర్లలో 123 రన్స్ ఇచ్చాడు

image

విజయ్ హజారే ట్రోఫీలో ఝార్ఖండ్‌తో జరిగిన మ్యాచులో పుదుచ్చేరి కెప్టెన్ అమన్ హకీం ఖాన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. 10 ఓవర్లలో ఏకంగా 123 రన్స్ సమర్పించుకున్నారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇదే అత్యంత చెత్త రికార్డు. ఈ మ్యాచులో ఝార్ఖండ్ 368/7 స్కోరు చేయగా, పుదుచ్చేరి 235 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో JHA 133 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా ఇటీవల IPL వేలంలో హకీంను CSK ₹40 లక్షలకు కొనుగోలు చేసింది.