News December 28, 2024
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన ప్రీ పీహెచ్‌డీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News December 29, 2024
కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు 6,479 మంది: ఎస్పీ
ఈనెల 30 నుంచి జనవరి 17వ తేదీ వరకు నిర్వహించే పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్‌కు 6,479 మంది హాజరవుతున్నారని అనంతపురం ఎస్పీ జగదీశ్ తెలిపారు. నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో ఈరోజు చేపట్టిన ట్రైల్ రన్ సక్సెస్ అయ్యిందన్నారు. వీరిలో 5,242 మంది పురుష అభ్యర్థులు, 1,237 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, మొత్తం కలిపి 6,479 మంది వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
News December 29, 2024
నా పిల్లల్ని తెలుగులోనే చదివిస్తున్నా: మంత్రి సత్యకుమార్
మాతృ భాషలో చదువుకుంటేనే పిల్లలకు తెలివితేటలు వస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. తాను మరాఠీ అయినా తన పిల్లల్ని మాత్రం తెలుగులోనే చదివిస్తున్నానన్నారు. సంస్కృతి, వారసత్వం అన్నీ భాషతోనే ముడిపడి ఉంటాయని, ప్రస్తుతం చాలామందికి తెలుగు రాయడం, చదవడం రావట్లేదన్నారు. మన తెలుగు ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
News December 29, 2024
సహకార సంఘాల సభ్యులు ఈకేవైసీని చేపట్టాలి: కలెక్టర్
అనంతపురం: ప్రాథమిక సహకార సంఘాల సభ్యుల ఈకెవైసీని చేపట్టాలని జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ (ఎఫ్ఏసీ) పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఏసీఎస్ కంప్యూటరైజేషన్‌లో భాగంగా రికార్డులలో ఈకేవైసీ నవీకరించుకోవాలని మిషన్ మోడ్‌లో చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల సభ్యులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకుంటే అర్హులైన వారు ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.