News February 22, 2025

అనంతపురం టుడే టాప్ న్యూస్

image

☛ రేపు అనంతపురం జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు యథాతథం
☛ అనంతపురం జిల్లాలో 144 సెక్షన్
☛ అనంతపురం హైవేపై రోడ్డు ప్రమాదం
☛ గుత్తి బావిలో పదో తరగతి విద్యార్థి మృతి
☛ ఈ నెల 25న రాయదుర్గంలో జాబ్ మేళా
☛ అనంతపురం JNTU బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల
☛ పరిటాల శ్రీరాంను అభినందించిన జేసీ

Similar News

News February 23, 2025

అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

image

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. అనంతపురం జిల్లాలో 14 కేంద్రాల్లో 7,293 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.

News February 23, 2025

కసాపురం అంజన్నకు వెండి రథోత్సవం

image

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచి ఉత్సవమూర్తికి విశేష పుష్పలతో అలంకరించి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News February 22, 2025

గ్రూప్‌-2 పరీక్షలపై అనంతపురం కలెక్టర్ క్లారిటీ!

image

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగవలసిన గ్రూప్‌-2 పరీక్షలు రద్దు అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వాటికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలని APPSCకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!