News March 28, 2024
అనంతపురం: పదో తరగతి బాలిక ఆత్మహత్య

కడుపు నొప్పి తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలో నివాసం ఉన్న తిరుపాలు, లలిత దంపతుల కుమార్తె సుజనా పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం 10వ తరగతి పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఆర్డీటీ ఆసుపత్రిలో పనిచేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Similar News
News September 7, 2025
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాప్తాడు మండలం అయ్యవారిపల్లి రోడ్లో ఉన్న మార్క్ఫెడ్ స్టాక్ స్టోర్ గోడౌన్ను తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వ ఉన్న యూరియాపై అధికారులతో ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
News September 7, 2025
పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

సీఎం పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతపురంలోని బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ప్రసన్నాయపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేసులు పాల్గొన్నారు.
News September 7, 2025
జోరుగా మహాలయ పున్నమి పండుగ

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహాలయ పున్నమి గురించి తెలియని వారుండరు. మాంసం ప్రియులకు ఇష్టమైన పండుగ ఇది. ఇవాళ మహాలయ పౌర్ణమి. వాడుకలో ఇది మాల పున్నమిగా ఉంది. ఇవాళ మటన్ తినడం పూర్వం నుంచి వస్తుందని పెద్దలు చెబుతారు. చంద్రుడిని చూస్తూ ముక్క తినాలంటారు. అందుకే తెల్లవారుజామునే పలు గ్రామాల్లో మటన్ వండుతారు. మాలపున్నమి కావడంతో మటన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి.