News September 10, 2025
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నేడు సెలవు

అనంతపురంలో నేడు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు సెలవు కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.
Similar News
News September 10, 2025
NLG: డ్రైవర్ల కొరతే ఆర్టీసీకి పెద్ద సమస్య..!

డ్రైవర్ల కొరతతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. నల్గొండ, సూర్యాపేట డిపోలకు మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. జీతాలు తక్కువగా ఉండడంతో పాటు.. డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ.30 వేల టార్గెట్లు ఇవ్వడంతో డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీకి డ్రైవర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. టార్గెట్లతో తమపై ఒత్తిడి పెరుగుతుందని డ్రైవర్లు అంటున్నారు.
News September 10, 2025
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిండిన చెరువులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,086, నాగర్‌కర్నూల్‌లో 1,222, వనపర్తిలో 1,096, నారాయణపేటలో 650, జోగులాంబ గద్వాలలో 375 చెరువులు దాదాపు 90 శాతం వరకు నిండిపోయాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మీ దగ్గర చెరువులు నిండాయా..? COMMENT
News September 10, 2025
కొడుకు పెళ్లికి ముహూర్తం కోసం వెళ్లి ప్రమాదంలో మృతి

కంచికచర్ల మండలం గని ఆత్కూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, రజినీ దంపతులు <<17658398>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వారి కుమారుడు హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహం కుదిరింది. మూహూర్తం కోసం ఖమ్మం (D) తక్కెళ్లపాడు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.