News September 9, 2025
అనంతపురానికి CM చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

★ రేపు మ.12 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం బయలుదేరుతారు
★ మ.1.30కి అనంతపురం చేరుకుంటారు
★ అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక ఉండవల్లికి తిరుగుపయనం
▶ అనంతపురానికి సీఎం, డిప్యూటీ సీఎం, కూటమి ఎమ్మెల్యేలందరూ వస్తుండటంతో 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News September 9, 2025
GWL: కాళోజీ సేవలు చిరస్మరణీయం- SP

ప్రజా కవి కాళోజీ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనికుడు అని కొనియాడారు. తన కవితలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపాడన్నారు.
News September 9, 2025
ఆసిఫాబాద్: ‘సదరన్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి’

ఆసిఫాబాద్ జిల్లాలో సదరన్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ దాత్తరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 15న మానసిక వైకల్యం, 16వ తేదీన మూగ, చెవిటి, 18న కంటి చూపు, 24న రక్త స్రావం, రుగ్మత, తలసేమియా, హిమొఫిలియా, 26వ తేదీన ఎముకలకు సంబంధించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంపులు ఉంటాయన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.