News January 5, 2026
అనంతలో ఆలయం తొలగింపు వివాదం.. రంగంలోకి హిజ్రాలు

కోర్టు ఆదేశాలతో అనంతపురంలోని కుక్కలపల్లి కాలనీ వద్ద ఉన్న శ్రీ నరిగమ్మ ఆలయ తొలగింపునకు ఆదివారం రెవెన్యూ, పోలీసులు యత్నించారు. అయితే BJP, VHP నాయకులు నిరసన తెలిపారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాలను కొత్తగా నిర్మించిన ఆలయంలోకి అధికారులు మార్చారు. అయితే BJP నాయకులు హిజ్రాలను రంగంలోకి దింపారు. తరలించిన విగ్రహాలను వారు యథాస్థానానికి చేర్చారు. పూజలు చేస్తూ తరలింపును అడ్డుకున్నారు.
Similar News
News February 20, 2026
మాజీ CM జగన్‌తో బ్రహ్మానందం ముచ్చట్లు

AP: గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ CM YS జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయం లాంజ్‌లో వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. ఒకరినొకరు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పొలిటికల్ స్టార్, కామెడీ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News February 20, 2026
సిరిసిల్ల: హడలెత్తిస్తున్న చిరుత పులులు..!

వేములవాడ(R) మం. హనుమక్కపల్లిలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడిచేసి చంపింది. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. అడవుల్లో పశువులను కట్టొద్దని కోరారు. జిల్లాలో 5చిరుతలు తిరుగుతున్నట్లు తెలిపారు.
News February 20, 2026
పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.


