News June 27, 2024
అనంతలో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రిలో 15 పడకలతో డయేరియా కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపర్ హిట్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా డయేరియా కేసులు అధికం అవుతుండటంతో మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. డయేరియా పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Similar News
News December 30, 2024
గుండెపోటుతో అనంతపురం వైసీపీ నేత మృతి
అనంతపురం జిల్లా పార్లమెంట్ వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్, అధ్యక్షుడు ప్రవీణ్ సాయి విఠల్ గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. విఠల్ మృతిపై వైసీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రవీణ్ సాయి విఠల్ మృతి చాలా బాధాకరమని వైసీపీ ట్వీట్ చేసింది. అతని ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది.
News December 30, 2024
కాపు రామచంద్రారెడ్డి పార్టీ మారనున్నారా?
అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. కూటమి అధికారంలోకి వచ్చినా తనకు అంత ప్రాధాన్యం లేదని భావిస్తున్న ఆయన తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని నెట్టింట జోరు ప్రచారం సాగుతోంది. అయితే దీనిని ఆయన అనుచరులు ఖండిస్తున్నారు.
News December 30, 2024
పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు: ఎస్పీ
నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో, రహదారులపై వేడుకల నిర్వహణకు అనుమతులు లేవన్నారు.