News January 8, 2025

అనంతలో విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లో ఉండే పుష్పావతి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 1, 2025

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ కురుగుంట-2, యాడికి-1, రాయదుర్గం-1, కొర్రపాడు-1 UPHCలో జరిగిన మాతృమరణాలపై కలెక్టర్ ఆరా తీశారు.

News November 1, 2025

ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

image

అనంతపురంలోని 26వ డివిజన్‌ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.

News November 1, 2025

ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

image

ఐసీడీఎస్‌లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.