News July 14, 2024

అనంత్ అంబానీకి విశాఖ ఎంపీ ఆశీర్వచనాలు

image

అంబానీ ఇంట పెళ్లికి విశాఖ ఎంపీ హాజరయ్యారు. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌‌తో పాటు ఎంపీ శ్రీభరత్ వెళ్లారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

విశాఖ: సెప్టిక్ ట్యాంక్‌లో పడి చిన్నారి మృతి

image

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆనందపురం మండలంలో చోటుచేసుకుంది. ముచ్చర్లలోని YSR కాలనీలో చిన్నారి ఢిల్లీశ్వరి గురువారం ఆడుకుంటుండగా మూత లేని సెప్టిక్ ట్యాంక్‌లో కాలుజారి పడిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా, సెప్టిక్ ట్యాంకులో తేలాడుతూ
చిన్నారి కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

News December 25, 2025

విశాఖ వుడా మాజీ అధికారి ఆస్తులు ఈడీ అటాచ్!

image

విశాఖ వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసుపర్తి ప్రదీప్‌కుమార్‌పై దాడులు నిర్వహించి ఈడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తులు జప్తు చేశారని తెలిపారు. జప్తు చేసిన వాటిలో ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.

News December 25, 2025

స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

image

జీవీఎంసీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిందని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తెలిపారు. జీవీఎంసీ హాల్లో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు తొలగింపు చేయడం జరిగిందని, విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1425 కోట్లతో 250 దుకాణాలను మొదటి ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి జోన్లో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్ని జరుగుతాయని తెలిపారు.