News January 24, 2025
అనంత: అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

నిత్యవసర సరకుల అక్రమ నిల్వలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో నిత్యవసర సరకులను సరఫరా చేస్తోందన్నారు. అవి లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలని సూచించారు. అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా ఒక ప్రత్యేక బృందం పని చేస్తోందని తెలిపారు. నిత్యవసర వస్తువులు కేవలం పేదలకు మాత్రమే చేరాలన్నారు.
Similar News
News October 21, 2025
‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.
News October 21, 2025
గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.
News October 20, 2025
ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.