News April 2, 2024
అనంత: అసమ్మతి నేతలను బుజ్జగించిన సీఎం జగన్
సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులును వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యక్తిని చూసుకోకుండా వ్యవస్థను చూసి పనిచేయాలని జగన్ కోరినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో శింగనమల నియోజకవర్గం వైసీపీ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, తరిమెల గోకుల్ రెడ్డి, చెన్నంపల్లి రాజన్న, చాములూరు రాజగోపాల్, తదితరులు ఉన్నారు.
Similar News
News January 23, 2025
రొళ్లలో యువకునిపై పోక్సో కేసు
రొళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన కిరణ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలాజీ తెలిపారు.17 ఏళ్ల వయసున్న బాలిక ఈనెల 2వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు బాలిక తల్లిదండ్రులు 4వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ ఘటన దర్యాప్తులో ఉండగా బుధవారం సాయంత్రం బాలిక ఇంటికి చేరుకొని కిరణ్ అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News January 23, 2025
సోమందేపల్లి: బంగారమని చెప్పి భారీ మోసం
నకిలీ నగలను బంగారమని చెప్పి అమ్మి మోసం చేసే ముఠాను సోమందేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు.. పొలాన్ని దున్నుతుంటే బంగారు హారాలు లభ్యమయ్యాయని, తక్కువకే ఇస్తామని ఇద్దరిని మోసం చేశారని తెలిపారు. వారి ఫిర్యాదుతో హిందూపురం – పెనుకొండ వైపుకు వస్తుండగా 10 మందిని పట్టుకోగా..నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ. రూ.21 లక్షలు, 5 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
News January 23, 2025
అనంతపురం జిల్లా నిరుద్యోగ మహిళలకు శుభవార్త
రూట్ సెట్ సంస్థలో ఈ నెల 25 నుంచి 30 రోజుల పాటు కంప్యూటర్ ట్యాలీలో ఉచితశిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45 ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు.