News March 24, 2026
అనంత ఆశాకిరణం!

1969లో విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన <<19461854>>ఆర్టీటీ<<>> (RDT) సంస్థ, గత 56 ఏళ్లుగా అనంతపురం జిల్లాలో పేదల పాలిట కొంగుబంగారంగా నిలుస్తోంది. కరవు సీమలో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించడం, పేద పిల్లలను చదివించడం, మహిళలు సొంతంగా ఎదిగేలా చేయడంలో ఈ సంస్థ పాత్ర మరువలేనిది. కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్న ఆర్టీటీ, అనంతపురం ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది.
Similar News
News March 26, 2026
2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.
News March 26, 2026
JNGM: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు పూజారి రమేష్ మృతి చెందిన ఘటన జనగాం జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే రమేష్ రోజు మాదిరిగానే తాడిచెట్టు ఎక్కేందుకు వెళ్ళాడు. తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు చికిత్స నిమిత్తం MGM ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News March 26, 2026
జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు: VZM JC

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధవారం స్పష్టం చేశారు. గ్యాస్ కొరత ఉన్నట్లు పత్రికల్లో వస్తున్న వార్తలను గమనించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్లు, పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్ వసతి గృహాలకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని సూచించారు.


