News December 28, 2025
అనంత: ఈనెల 29న కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News December 30, 2025
నీటి తొట్టెలో పడి అనంతపురం జిల్లా చిన్నారి మృతి

కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక రామాంజనేయులు, అశ్వని దంపతుల కుమార్తె ఈక్షిత (2) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక మృతి చెందింది. ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 30, 2025
నూతన సంవత్సర వేడుకలపై SP ఆంక్షలు

అనంతపురంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా SP జగదీష్ ఆంక్షలు విధించారు. వేడుకలు రాత్రి 1 లోపు ముగించాలని ప్రకటించారు. రహదారులను బ్లాక్ చేసి వేడుకలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దన్నారు. సైలెన్సర్ తొలగించి శబ్ద కాలుష్యం సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలను నిర్ణీత సమయానికి మూసివేయాలని హెచ్చరించారు.
News December 30, 2025
టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి సమావేశం

రాయదుర్గం టెక్స్‌టైల్ పార్క్‌లో త్వరితగతిన గార్మెంట్ యూనిట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఆనంద్ అనంతపురంలో నిర్వహించారు. ఇది వరకే ప్లాట్లు పొంది నేటికి యూనిట్ల నిర్మాణం చేపట్టని 47 మంది యూనిట్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇది చివరి అవకాశంగా తెలియజేసి కేటాయించిన ప్లాట్లలో తక్షణమే యూనిట్లను నిర్మాణం చేసేలాగా జిల్లా జౌళిశాఖ అధికారిని ఆదేశించారు.


