News December 28, 2025
అనంత: ఈనెల 29న కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News December 29, 2025
అనంతపురం పోలీస్ కార్యాలయంలో వినతుల వెల్లువ

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 70 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఎస్పీ స్వయంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో ప్రతి పిటిషన్‌ను విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.
News December 29, 2025
కలెక్టరేట్‌లో వినతుల వెల్లువ

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనగా, మొత్తం 467 అర్జీలు నమోదయ్యాయి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News December 29, 2025
జనవరి 7 నుంచి అనంతపురం జిల్లా స్థాయి పాల పోటీలు

పాడి రైతులకు మేలు జాతి పశుపోషణ, అధిక పాల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ‘అనంత పాలధార’ కరపత్రికలను ఆయన ఆవిష్కరించారు. జనవరి 7, 8 తేదీల్లో ఆకుతోటపల్లిలో జిల్లా స్థాయి పాల పోటీలు జరుగుతాయన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించి పాడి పరిశ్రమలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.


