News October 30, 2024

అనంత: ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

image

బెలుగుప్ప మండలం జీడిపల్లికి చెందిన నవ్య(22) ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవ్య డిగ్రీ చదవడంతో పాటు సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసింది. పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. కానీ ఉద్యోగం దొరకలేదు.ఇక ఉద్యోగం రాదనే బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 31, 2024

ప్రమాదం సంభవిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనంతపురం SP

image

టపాకాయలు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్వాహకులు తీసుకున్న జాగ్రతలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 101, 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తారని స్పష్టం చేశారు.

News October 31, 2024

గుంతకల్లు: దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లు

image

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో దీపావళి పండుగ సందర్భంగా అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి రైలు (06237) నవంబరు 4న రాత్రి 9.00 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణించి నవంబరు 6వ తేదీ రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు బరౌనీలో నవంబరు 9న ఉ.10 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

News October 31, 2024

శ్రీ సత్యసాయి: ‘కేజీబీవీ టీచింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ వచ్చేసింది’

image

శ్రీ సత్యసాయి జిల్లాలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు మెరిట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు బ్లాక్ స్పాట్‌లో ఉంచినట్లు డీఈవో కిష్టప్ప తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆధారాలతో అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.