News September 1, 2025

అనంత: చెత్త సంపద తయారీ కేంద్రం పరిశీలన

image

చెత్త సంపద తయారీ కేంద్రాలతో పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం రూరల్‌లోని చియ్యేడులో నూతన గోకులం షెడ్డును అధికారులు కలిసి ప్రారంభించారు. ముందుగా మొక్కలను నాటారు. అనంతరం చెత్త సంపద సృష్టి కేంద్రంలోని తొట్టెల్లో తయారవుతున్న వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువును ఆయన పరిశీలించారు.

Similar News

News September 2, 2025

విద్యార్థినిని అభినందించిన అనంతపురం కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి HIVపై విద్యార్థులకు అవగాహణ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 26న విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో తాడిపత్రి కళాశాల విద్యార్థిని గౌసియా మొదటి బహుమతి సాధించింది. కాగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ భవన్‌లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అనంతరం విద్యార్థిని అభినందించారు. జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో రాణించాలన్నారు.

News September 1, 2025

గుత్తి: కలెక్టర్‌కు గాంధీజీ చిత్రపటం బహుకరణ

image

జాతిపిత మహాత్మా గాంధీ పెయింటింగ్ చిత్రపటాన్ని గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ భాస్కర్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు బహుకరించారు. చీరాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవి జర్మన్ కాన్వాస్‌పై చిత్రీకరించిన గాంధీజీ చిత్రపటాన్ని అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులను అభినందించారు.