News December 26, 2025
అనంత: జనవరిలో గోధుమ పిండి పంపిణీ

అనంతపురం, పుట్టపర్తి పట్టణాల్లోనిః రేషన్ షాపుల ద్వారా జనవరి నుంచి గోధుమ పిండి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని 41 వేల మంది కార్డుదారులకు కిలో ప్యాకెట్లు అందజేయనున్నారు. డిమాండ్‌ను బట్టి గ్రామాల్లోనూ సరఫరా చేయనున్నారు. అయితే, జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా.. శుక్రవారం వరకు డీలర్ల వద్దకు సరకు చేరలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
Similar News
News January 6, 2026
రాష్ట్రంలో 1095 పోస్టులకు నోటిఫికేషన్

AP: <
News January 6, 2026
ఏపీలో వేగంగా ఎయిర్‌పోర్టులు!

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్‌పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.
News January 6, 2026
PDPL: అనాథ పిల్లలందరూ చదువుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, పిల్లల తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులను వారికే దక్కేలా చూడాలన్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, బాలసదనంలో మెరుగైన వసతులతో పాటు బెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


