News April 17, 2024

అనంత జిల్లాలో టీసీసీ – 2024 పరీక్షలు

image

అనంతపురం జిల్లాలో టీసీసీ – 2024 డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌ గ్రేడ్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌ టికెట్‌తో పాటు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Similar News

News November 3, 2025

435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.

News November 3, 2025

‘అనంతపురాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి’

image

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతివృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 2, 2025

అనంతపురం: డివైడర్‌ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

image

అనంతపురం నగర శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఆలుమూరుకు చెందిన అవినాష్ అనే యువకుడు మృతి చెందాడు. అవినాష్ బైక్‌పై అనంతపురం నుంచి హిందూపూర్‌కి వెళుతుండగా డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అవినాష్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అవినాష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.