News October 8, 2024
అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం.. UPDATE

అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని శ్రీనివాస మిల్క్ డైరీ సమీపంలో గల 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పామిడిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన లాలెప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మృతుడు గుత్తి ఏపీ మోడల్ స్కూలులో అటెండర్‌గా పని చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News April 14, 2026
అనంతపురంలో 48,116 మంది విద్యార్థుల ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు ప్రభుత్వం సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ వెలువడనున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రథమ సంవత్సరం 24,568 మంది, ద్వితీయ సంవత్సరం 23,578 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఆర్ఐఓ రమణ నాయక్ తెలిపారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 13, 2026
హౌసింగ్ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అనంతపురం కలెక్టర్ ఆనంద్ హౌసింగ్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీఎంఏవై అర్బన్, గ్రామీణ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News April 13, 2026
PGRSలో 169 పిటిషన్లు స్వీకరించాం: SP జగదీష్

అనంతపురం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 169 పిటిషన్లు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి సమస్యలను తెలుసుకుని పోలీసు అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.


