News May 10, 2024

అనంత జిల్లాలో 101.6 మి.మీ వర్షపాతం నమోదు

image

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 101.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా ఉరవకొండలో 23.6 మి.మీటర్లు, యాడికి 18.4, రాయదుర్గం 16.2, విడపనకల్లు 15.2, బెలుగుప్ప 13.6, కళ్యాణదుర్గం 11.6, గుమ్మగట్ట 4.8, కంబదూరు 4.6, కనేకల్ 2.0, పెద్దపప్పూరు 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News March 15, 2025

ATP: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని నాయకునిపల్లి గ్రామానికి చెందిన మునిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్‌కు ఉన్న మెయిన్ లైన్ నుంచి వచ్చే హెడ్ ఫీజులు కట్ కావడంతో వేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విద్యుత్తు ప్రవహించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 15, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి

image

ఆదోనిలోని ఇంద్రనగర్‌కు చెందిన బాలు, గుత్తి మండలం కొత్తపేటకు చెందిన స్రవంతి ప్రేమించుకుని శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్నారు. రెండేళ్ల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని చాటిచెబుతూ.. పెద్దల సమక్షంలో ఆదోనిలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.

News March 15, 2025

శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించండి: ఎస్పీ

image

మహిళలు, అమ్మాయిల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించి అమల్లోకి తీసుకొచ్చిన శక్తి యాప్ పట్ల జిల్లాలో విస్తృతంగా అవగాహన చేయాలని పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌కు ఎస్పీ జగదీశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ తమ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందేలా చైతన్యం చేయాలన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించవచ్చన్నారు.

error: Content is protected !!