News March 21, 2025
అనంత జిల్లాలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నట్లు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు తెలిపారు. 5 రోజులలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. 14న 40.4°, 15న 39.8°, 16న 39.2°, 17న 40.7°, 18న 39.2°, 1940.7°, 20న 41.1° డిగ్రీలు నమోదు అయ్యాయని వివరించారు. వేసవి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 10, 2025
రాగులపాడు పంప్ హౌస్‌లో 10 మోటార్లతో నీటి పంపింగ్

వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 10 మోటార్ల ద్వారా శనివారం నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలోకి పంపింగ్ చేశారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా కాలువలో పుష్కలంగా నీరు వస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.
News August 9, 2025
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నంబర్లకు ఫోన్ చేయండి: ఎస్పీ

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే డయల్ 100/112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లాలోని వాహనదారులు అధిక శబ్దంతో కూడిన స్పీకర్లు, సైలెన్సర్లు ఉపయోగించి అధిక వేగంగా వెళ్లరాదన్నారు. బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లరాదన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదన్నారు.
News August 9, 2025
అనంత జిల్లాలో 746 కేసులు నమోదు

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.