News April 11, 2024
అనంత: తెగిపడిన హైటెన్షన్ వైరు.. తప్పిన పెను ప్రమాదం

గుంతకల్లులోని కసాపురం రోడ్డులోని అయ్యప్ప దేవాలయం వద్ద బుధవారం హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ వైరు తెగిపడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అయితే శాటిలైట్ అనుసంధానంగా ఆ లైన్ బ్రేక్ డౌన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్పందించిన ట్రాన్స్ కో ఉన్నతాధికారులు సిబ్బందిని పురమాయించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News November 1, 2025
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ కురుగుంట-2, యాడికి-1, రాయదుర్గం-1, కొర్రపాడు-1 UPHCలో జరిగిన మాతృమరణాలపై కలెక్టర్ ఆరా తీశారు.
News November 1, 2025
ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

అనంతపురంలోని 26వ డివిజన్ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.
News November 1, 2025
ఖాళీల భర్తీలు పక్కా ఉండాలి: అనంత కలెక్టర్

ఐసీడీఎస్‌లో ఖాళీల భర్తీకి నిబంధనల ఉల్లంఘనకు తావులేదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 36 వర్కర్లు, 68 హెల్పర్లు కలిపి మొత్తం 104 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


