News November 17, 2024
అనంత: నేడు నిశ్చితార్థం.. అంతలోనే విషాదం
తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గీతా అనే యువతి మృతిచెందిన విషయం విధితమే. ఆ యువతికి నేడు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గీత, ఆమె తమ్ముడు నారాయణరెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News November 17, 2024
అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్
అపార్ జనరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అపార్ జనరేషన్ ప్రక్రియపై డిఇఓ, డివిఈవో, ఆయా కళాశాల ప్రిన్సిపల్, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అపార్ జనరేషన్ జరిగిన చర్యలు తీసుకోవాలన్నారు.
News November 17, 2024
24 గంటల్లో 513 కేసులు పెట్టిన అనంతపురం పోలీసులు
అనంతపురం జిల్లాలో నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై పోలీసులు దృష్టిసారించారు. ఇందులో భాగంగా హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారు, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్‌పై తనిఖీలు చేపట్టారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 513 కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1.10 లక్షల ఫైన్ వేశామని ఎస్పీ జగదీశ్ తెలిపారు. అలాగే రాత్రి జిల్లా వ్యాప్తంగా 154 ఏటీఎంలను తనిఖీ చేశారు.
News November 17, 2024
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి: ఎస్పీ
అనంతపురం జిల్లాలో రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 24 గంటల్లో 513 కేసులు నమోదు చేసి రూ.1.10 లక్షలు జరిమానాలు వేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం తాగి అతివేగంగా వాహనాలు నడపరాదని తెలిపారు.