News February 22, 2026
అనంత: పరీక్షకు ముందే ఇంటర్ ప్రశ్నపత్రాల ఓపెన్

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశ్నపత్రాలు ఆయా సెంటర్లకు చేరుకున్నాయి. అయితే ఒక కేంద్రానికి కేటాయించిన బండిళ్లు మరో కేంద్రానికి వచ్చాయి. పరీక్షకు 10 నిమిషాల ముందు తెరవాల్సిన బండిళ్ల (సెట్-3)ను నిన్ననే ఓపెన్ చేయడం చర్చనీయాంశమైంది. ఉరవకొండలోని ఓ కేంద్రానికి సంబంధించిన కవర్లు చెక్ చేయగా 6 కవర్లలో 4 కవర్లు అదే సెంటర్‌కు, మిగిలిన 2 కవర్లు వేరే సెంటర్లకు చెందినవిగా గుర్తించారు.
Similar News
News February 22, 2026
సిరిసిల్ల: రేపటి ప్రజావాణి యథాతథం..!

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మున్సిపల్ ఎన్నికలు, మహాశివరాత్రి వేడుకల నేపథ్యంలో గతవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
News February 22, 2026
పాత గాజువాక జంక్షన్‌లో యాక్సిడెంట్

పాత గాజువాక జంక్షన్‌లో ఆదివారం ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వ్యక్తి తలపై నుంచి టిప్పర్ చక్రాలు వెళ్లిపోవడంతో తల నుజ్జునుజ్జయిపోయింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు, మృతుడు వివరాలు సేకరిస్తున్నారు.
News February 22, 2026
పాకిస్థాన్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోతుండటానికి టీమ్ సెలక్షనే కారణం అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని.. అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాక్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. కాగా పాక్ <<19206100>>సెమీస్<<>> చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.


