News March 11, 2025

అనంత: పోలీసు గ్రీవెన్స్‌కు 61 ఫిర్యాదులు: జిల్లా SP

image

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు ప్రజల నుంచి 61 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబందిత పోలీసు అధికారులకు పంపి బాధితులకు న్యాయం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 11, 2025

మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

image

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.

News March 11, 2025

అనంత: ‘స్వీకరించిన అర్జీలను పరిష్కరిస్తాం’

image

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

News March 10, 2025

అనంత: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. కమలనగర్‌లోని శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా జరుగుతున్నాయని వివరించారు. అధికారులు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నట్లు వెల్లడించార

error: Content is protected !!