News April 16, 2025
అనంత: బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి సన్మానం

బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి జస్టిస్ జి.శ్రీనివాస్‌ను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం సన్మానించారు. అనంతరం జడ్జికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానం చేశారు. జిల్లా జడ్జిగా ఉత్తమ సేవలు అందించారని.. జిల్లా పోలీసుశాఖ, జిల్లా న్యాయశాఖలు పరస్పర సహకారంతో ముందుకెళ్లి బాధితులకు న్యాయం, నిందితులకు శిక్షలు పడటాన్ని గుర్తు చేసుకున్నారు.
Similar News
News April 23, 2025
కూలీ కుమారుడికి 593 మార్కులు

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
News April 23, 2025
10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్‌తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.
News April 23, 2025
10th Results: 23వ స్థానంలో అనంతపురం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 30,700 మంది పరీక్ష రాయగా 21,510 మంది పాసయ్యారు. 15,733 మంది బాలురులో 10,315 మంది, 14,967 మంది బాలికలు పరీక్ష రాయగా 11,195 మంది పాసయ్యారు. 70.07 పాస్ పర్సంటైల్‌తో అనంతపురం జిల్లా 23వ స్థానంలో నిలిచింది.