News February 12, 2025
అనంత: బీటెక్ ఫలితాల విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365363171_51349305-normal-WIFI.webp)
అనంతపురం JNTU పరిధిలో డిసెంబర్, జనవరిలో నిర్వహించిన బీటెక్ 4-1, 4-2 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News February 12, 2025
మన్యంకొండకు పోటెత్తిన భక్త జనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368513711_60392612-normal-WIFI.webp)
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లానుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి జరిగే (తెరు) రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తజనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కాలినడకన కదలి రావడం జరిగింది. గోవిందా.. హరి.. గోవిందా అంటూ గోవిందా నామాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
News February 12, 2025
ఎల్లారెడ్డి: ప్రణాళికతో చదివితే ఉత్తీర్ణత సాధించవచ్చు: DEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355938562_50226745-normal-WIFI.webp)
ప్రతి విద్యార్థి ప్రణాళికతో చదివితే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి తొలి మెట్టుగా భావించాలన్నారు.
News February 12, 2025
‘సింగిల్ విండో పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372169605_51916297-normal-WIFI.webp)
సింగిల్ విండో పాలకవర్గాల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించాలని మహబూబ్ నగర్ పీఎసీఎస్ ఛైర్మన్లు డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఎసీఎస్ చైర్మన్లు మాట్లాడుతూ సర్పంచులు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ల పాలకవర్గం ముగియగానే అధికారుల పాలన మొదలవుతుందని, అధికారుల పాలనలో కంటే ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను కొనసాగిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.